ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS MLC ELECTIONS 2021: స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు

By

Published : Nov 25, 2021, 5:32 PM IST

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో స్థానాన్ని తెరాస ఏకగ్రీవాలు చేసుకుంటోంది. ఇప్పటికే.. 6 స్థానాలను కైవసం చేసుకోగా.. మిగిలిన వాటిపైనా దృష్టి సారించింది. ఈ క్రమంలో నిజామాబాద్‌ స్థానం నుంచి కవిత ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

MLC ELECTIONS 2021
MLC ELECTIONS 2021

Telangana MLC elections 2021: తెలంగాణలో స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కొక్కొటిగా అధికార తెరాస ఏకగ్రీవం చేసుకుంటోంది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఆరింటిని తెరాస ఖాతాలో వేసుకుంది. వరంగల్‌లోనూ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలు తెరాస ఖాతాలోకి చేరాయి. పోటీకి దిగిన ఒకే ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది.

MLC elections 2021: బుధవారం నిజామాబాద్‌ స్థానం నుంచి కవిత నామినేషన్‌ ఒక్కటే మిగలగా.. ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రంగారెడ్డి జిల్లాలోనూ బరిలో ఎవరూ నిలవకపోవడంతో రెండు స్థానాలు తెరాస ఖాతాలోకి చేరాయి. శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి అభ్యర్థులిద్దరే పోటీలో నిలిచారు. వీరి ఎన్నికను రేపు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి బరిలో దిగిన తెరాస అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీలో మిగిలారు. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇదీ చదవండి:

జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. పిటిషనర్లకు సీబీఐ అఫిడవిట్

ABOUT THE AUTHOR

...view details