తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో హరిహరపురం కాలనీ పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. కాలనీలో సుమారు 300 ఇళ్లు వరద ముంపులోనే ఉన్నాయి. పూర్తిగా వరద నీటిలోనే కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి.
తెలంగాణ: వనస్థలిపురంలో జలదిగ్భంధంలో 300 ఇళ్లు - హరిహరపురం కాలనీలో వరద నీరు
తెలంగాణలోని వనస్థలిపురంలోని పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. హరిహరపురం కాలనీలో దాదాపు 300 ఇళ్లు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో సహాయచర్యలకు అటంకం ఏర్పడింది.
తెలంగాణ: వనస్థలిపురంలో వెల్లువలా వరద ...జలదిగ్భంధంలో 300 ఇళ్లు
రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో సహాయ చర్యలకు తీవ్ర అటంకం కలుగుతోంది. కాప్రాయి చెరువుకు గండి పడుతుందనే భయంతో పది కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తక్షణమే పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.