హైదరాబాద్ వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ప్రగతినగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కనిపించకుండాపోయారు. నిన్న ఉదయం నుంచి బాలికలు ఐశ్వర్య(17), ఆస్మా(15), అబీర్(14) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు - వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అదృశ్యమైన ముగ్గురు బాలికలు
అయితే స్థానికంగా ఉండే రమేశ్ అనే యువకుడు, అతని స్నేహితులు కిడ్నాప్ చేయించినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని వెంటపడతుండటం వల్ల పలుమార్లు రమేశ్‌ని హెచ్చరించామని తెలిపారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రమేశ్‌ను అరెస్టు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:తక్కువ వడ్డీకే రుణాలిప్పిస్తానని మోసం..రూ.4.5 కోట్లకు టోపీ