ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీశైలానికి తగ్గిన వరద.. 3గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - శ్రీశైలం నీటిమట్టం వార్తలు

శ్రీశైలానికి వరద ఉద్ధృతి తగ్గింది. ప్రస్తుతం మూడు గేట్లు ఎత్తి... 1,14,896 క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింతల గేట్లను పూర్తిగా మూసివేశారు.

Srisailam Dam
Srisailam Dam

By

Published : Sep 25, 2020, 9:21 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గింది. ప్రాజెక్టుకు 1,36,330 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 3 గేట్లు ఎత్తి దిగువకు 1,14,896 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరగా.... ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

గేట్లు మూసివేత

ఎగువ నుంచి వరద తగ్గటంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 33వేల క్యూసెక్కులు ఉండగా... నీటినిల్వ 45.25 టీఎంసీలుగా నమోదైంది.

ఇదీ చదవండి

జీవోలో 'ముస్లిం యూత్​' అని ఎలా ప్రస్తావిస్తారు?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details