Hawala money seized in Hyderabad: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.3.5 కోట్లను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలోని హోటల్ మ్యారియట్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 కార్లలో తరలిస్తున్న రూ.3.5 కోట్లను హవాలా డబ్బుగా గుర్తించి.. సీజ్ చేశారు.
తెలంగాణలో మరోసారి హవాలా డబ్బు పట్టివేత.. ఈ సారి రూ3.5 కోట్లు సీజ్ - రూ 3 కోట్ల 50 వేల హవాలా డబ్బు పట్టివేత
Money Seized: తెలంగాణలో మరోమారు భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. గత కొన్నిరోజులుగా వరుసగా భారీ స్థాయిలో హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ సారి రూ.3.5 కోట్లను సీజ్ చేశారు పోలీసులు.
hawala
రెండు కార్లలో వెళ్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల... దానిని ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:
- "25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులకు వెళ్లండి"
గుంటూరులో ఫుడ్ ఎక్స్‌ప్రెస్... దక్షిణ మధ్య రైల్వేలో తొలి రైల్‌కోచ్ రెస్టారెంట్ - పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం... తొలిఘట్టం తొలేళ్ల పండుగ