తెలంగాణ రాష్ట్రం నారాయణగూడ పోలీస్స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. విధుల్లో ఉన్న సమయంలో కానిస్టేబుళ్లు మద్యం సేవించారు. వీరు మద్యం తాగుతుండగా ఓ జవాన్ వీడియో తీశారు. కోపంతో ఊగిపోయిన కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్, శివప్రసాద్... ఆ జవాన్పై దాడిచేశారు.
విధుల్లో మద్యం తాగిన కానిస్టేబుళ్లపై వేటు - Cp anjani kumar latest updates
విధుల్లో ఉన్న సమయంలో మద్యం తాగినందుకు ముగ్గురు కానిస్టేబుళ్లను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. వీరంతా నారాయణగూడ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నారు.
కానిస్టేబుళ్లపై వేటు
బాధితుడి ఫిర్యాదుతో సీపీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఆ ముగ్గురు నిబంధనలు అతిక్రమించారని తేలడంతో... సీపీ వారిని సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి:మద్యం మత్తు... కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన బైక్