గోడకూలి నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి - హైదరాబాద్‌లో గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
అప్పటిదాకా తమ చెల్లెలితో ఆడుతూ కేరింతలు పెట్టిన ఆ చిన్నారులు అమ్మ పిలవగానే పడుకోవడానికి వెళ్లారు. మృత్యువు పొంచి ఉందనే విషయం తెలియని ఆ పసిపాపలు... అమ్మతో కబుర్లు చెబుతూ నిద్రపోయారు. అర్ధరాత్రి గోడ కూలి నిద్రలోనే మృత్యు ఒడిలోకి ఒదిగిపోయారు.
three-children-died
హైదరాబాద్ హబీబ్‌నగర్ పరిధిలోని అఫ్జల్‌సాగర్ రోడ్డులోని మాన్‌గరి బస్తీలో విషాదం చోటుచేసుకుంది. మాన్‌గరి బస్తీలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన రోషిణి(6), సారిక(3), నాలుగు నెలల చిన్నారి పావని మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.