తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి పదేళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన షాద్‌నగర్ పరిధిలోని సోలిపూర్లో జరిగింది. ఘటనలో గ్రామానికి చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫారిన్ అనే ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నీటిలో మునిగి మృతి చెందిన వీరిని గ్రామస్థులు బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదవశాత్తు నీటి గుంతలో ముగ్గురు చిన్నారులు మృతి - తాజా నేర వార్తలు
తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి పదేళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
child