ఆంధ్రప్రదేశ్

andhra pradesh

bullet bandi song: బుల్లెటు బండి పాటకు వెయ్యి మంది డాన్స్​.. వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు..

By

Published : Feb 27, 2022, 8:41 AM IST

bullet bandi song: వివాహ వేడుకైనా.. పుట్టినరోజు పండుగైనా.. ఏ కార్యక్రమంలోనైనా వినిపిస్తున్న పాట బుల్లెటు బండి. పాట వచ్చిందంటే చాలు.. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నృత్యం చేస్తున్నారు. అయితే ఈ పాటకు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఏకంగా వెయ్యిమందితో నృత్య ప్రదర్శన నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి చిన్నారులు, యువతులు హాజరై ఆడిపాడారు. ఈ ప్రదర్శన వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించుకుంది.

Bullet bandi song
Bullet bandi song

bullet bandi song: తెలంగాణలోని జగిత్యాల మినీ స్టేడియం అంతర్జాతీయ రికార్డుకు వేదికైంది. వెయ్యిమంది విద్యార్థులు బుల్లెటు బండి పాటకు నృత్యం చేశారు. కళాకారుడు మచ్చురవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌, చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్, కలెక్టర్‌ రవి హాజరయ్యారు. ఇందులో చిన్నారులు, యువత పాటకు తగినట్లుగా అభినయించారు.

వెయ్యి మంది ఒకేసారి నృత్యం..

రాష్ట్రంలోని నలుమూలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. నెలరోజుల పాటు శిక్షణ తీసుకుని ప్రదర్శనలో పాల్గొన్నామని తెలిపారు. ఇందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల బుల్లెటుబండి పాటపై నృత్యం చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన పెళ్లికూతురు సాయి శ్రీ సైతం ప్రదర్శనలో పాల్గొన్నారు. వెయ్యి మంది ఒకేసారి నృత్యం చేస్తుండగా చూడటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచం రికార్డు సాధించటం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. కేవలం ఒక పాట కోసమే నిర్వహించిన నృత్య ప్రదర్శనకు అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కింది. ప్రదర్శన అనంతరం నిర్వహకులు అవార్డు అందజేశారు.

ఇదీ చూడండి:నా జీవితం ఆ సినిమాలా ఉంటుంది​: దేవిశ్రీప్రసాద్​

ABOUT THE AUTHOR

...view details