ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చిటికెన వేలికి సిరా గుర్తు - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తాజా సమాచారం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే వారికి ఎడమ చేయి చిటికెన వేలికి సిరా గుర్తు వేయనున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ink symbol
చిటికిన వేలికి సిరా గుర్తు

By

Published : Apr 6, 2021, 1:41 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 8న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే వారికి ఎడమ చేయి చిటికిన వేలికి సిరా గుర్తు వేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమచేతి చూపుడు వేలికి సిరా వేశారు. ఈ ప్రక్రియ జరిగి కొద్ది రోజులే అయిన కారణంగా.. చేతి పై సిరా గుర్తు ఇంకా చెడిపోయి ఉండదని అధికారులు భావించారు. ఈ క్రమంలో ఎడమ చేతి చిటికెన వేలును..సిరా గుర్తు వేయటానికి ఎన్నికల సంఘం నిర్ణయింది. పోలింగ్ అధికారులకు ఇచ్చే శిక్షణలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు స్పష్టంగా వివరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details