ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఇది శుభారంభం: నిమ్మగడ్డ - Nimmagadda Ramesh Kumar comments panchayat elections

ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన దశల్లోనూ ఇదే ఒరవడి కొనసాగాలన్న నిమ్మగడ్డ... ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు.

ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఇది శుభారంభం: నిమ్మగడ్డ
ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఇది శుభారంభం: నిమ్మగడ్డ

By

Published : Feb 9, 2021, 7:41 PM IST

తొలి దశ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. మిగిలిన దశల్లోనూ ఇదే ఒరవడి కొనసాగాలని ఆకాంక్షించారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. తొలిదశ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎస్‌ఈసీ వెల్లడించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06 శాతం పోలింగ్‌ నమోదైందని.... ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఇది శుభారంభమని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details