ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లాలి: సీఎం జగన్

ఈనెల 25 నుంచి 15 రోజుల పాటు.. గ్రామగ్రామానికీ వెళ్లి... ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల ప్రచారానికి ఇదో మంచి అవకాశంగా అభివర్ణించారు. చిన్నచిన్న కారణాలకు రేషన్‌ కార్డులు తొలగించవద్దని... అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

this-december-25th-house-rails-distribution-program-in-ap
ఈనెల 25 నుంచి 15 రోజుల పాటు ఇళ్లపట్టాల పంపిణీ

By

Published : Dec 19, 2020, 8:28 AM IST

ఈనెల 25 నుంచి 15 రోజుల పాటు ఇళ్లపట్టాల పంపిణీ

స్థానిక ఎన్నికలకు ముందు... గ్రామగ్రామాన ఇళ్లపట్టాల పంపిణీ... ప్రచారానికి మంచి అవకాశంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. శుక్రవారం.... కేబినెట్‌ భేటీ తర్వాత.... అమాత్యులతో సుమారు 40 నిమిషాలకుపైగా సీఎం మాట్లాడారు. వైకాపా ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇళ్లపట్టాల పంపిణీ ఎలా అని కొందరు మంత్రులు ప్రస్తావించగా.... అక్కడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు వస్తామంటే... బంగారంలా ఆహ్వానించండి అని సీఎం అన్నట్లు తెలిసింది. పట్టాపత్రాలపై మన ఫొటోలే ఉంటాయని.... వాటినే ఆ ఎమ్మెల్యే పేదలకు అందిస్తారని అన్నట్టు సమాచారం. ఇళ్లపట్టాల భూములు చదును చేసేందుకు తీసుకొస్తున్న మట్టి ట్రాక్టర్లు, వాహనాలను ఎస్​ఈబీ అధికారులు ఆపేస్తున్నారని మంత్రి విశ్వరూప్‌.... సీఎం వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లనూ వారు పట్టించుకునే పరిస్థితిలో లేరని కొందరు మంత్రులు సీఎం వద్ద చెప్పినట్టు సమాచారం. జిల్లా అథారిటీని కాదని వ్యవహరించవద్దని.... ఎస్​ఈబీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని... అధికారులను సీఎం ఆదేశించారు.

అధిక విద్యుత్‌ వాడారని కార్డులు తీసేశారు

అనంతపురం జిల్లాలో 10 ఎకరాలున్నవారికైనా.... ఎలాంటి ఆదాయమూ ఉండదని..... వారికి రేషన్‌ కార్డులు ఇవ్వమంటే.... అధికారులు ఇవ్వడం లేదని... మంత్రి శంకరనారాయణ సీఎంకు చెప్పినట్ట సమాచారం. అధికారులు నిబంధ‌న‌లు ప్రకారమే పనిచేస్తారని..... మనమే వాటిని మార్చుకుంటూ పోతే ఎలా అని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చిన్నచిన్న అంశాలకూ కార్డులు తొలగిస్తున్నారని.... ఒక నెల 300 యూనిట్ల విద్యుత్‌ వాడారన్న కారణంతో.... తర్వాత నెల కార్డులు తీసేస్తున్నారని మంత్రి కన్నబాబు సీఎం దృష్టికి తీసుకొచ్చారని సమాచారం. చిన్నచిన్న కారణాలకే కార్డులు తీసేయొద్దని...అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ బీమా చెల్లింపులో జాప్యం

వైఎస్సార్‌ బీమా పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా చెల్లించేసినా....బీమా కంపెనీల నుంచి సమాచారాన్ని తీసుకుని, డబ్బును లబ్ధిదారులకు ఇవ్వడంలో బ్యాంకర్లు జాప్యం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. వారంలోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బీమా సాయం జమ చేయాలని బ్యాంకర్లకు స్పష్టంగా చెప్పాలని.... ఆర్థికశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగి చనిపోతే వారిపై ఆధారపడిన వారికి ఇచ్చే డిపెండెంట్‌ పింఛన్లు అందడం లేదని కొందరు తన దృష్టికి తీసుకొచ్చినట్లు..... ఉపముఖ్యమంత్రి అంజద్‌ బాషా ప్రస్తావించారు. 45 ఏళ్లు పైబడిన వారికి డిపెండెంట్‌ పింఛను ఇవ్వడం లేదని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అందరికీ ఇవ్వలేం కదా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

'రాజ్యాంగబద్ధ విధుల నిర్వహణకు సహకరించట్లేదు'

ABOUT THE AUTHOR

...view details