Amaravati Farmers Padayatra: రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. దుగ్గిరాల పట్టణంలో స్థానికులు పూలు చల్లి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన ఈ పాదయాత్ర జయప్రదం కావాలని వారు ఆకాంక్షించారు.
Third day Padayatra: ఉత్సాహంగా మూడోరోజు పాదయాత్ర - ఏపీ తాజా వార్తలు
Third day Padayatra: అమరావతి ఏకైక రాజధాని అంటూ చేపట్టిన మహా పాదయాత్ర మూడోరోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. అమరావతి రైతుల యాత్ర గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి తెనాలి చేరుకుంది.

మహా పాదయాత్ర మూడోరోజు
పాదయాత్రలో పాల్గొనే రైతులకు పోలీసులు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. తమకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్లు పాదయాత్రలో పాల్గొన్న పలువురు రైతులు తెలిపారు. ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు.
ఇవీ చదవండి: