ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహారాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దొంగలు దాడి - telangana news

షిర్డీ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. తెలంగాణవాసుల కారుపై దొంగలు దాడి చేశారు. మహారాష్ట్రలో కర్ణాటక సరిహద్దు వాసీ వద్ద కారుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

thieves-attack-telangana-peoples-car
మహారాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దాడి

By

Published : Feb 13, 2021, 5:34 PM IST

మహారాష్ట్రలో తెలంగాణవాసుల కారుపై దొంగలు దాడి చేశారు. షిర్డీ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దు వాసీ వద్ద కారుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దొంగల నుంచి తప్పించుకునే క్రమంలో కారు బోల్తా పడి.. ఐదుగరికి గాయాలయ్యాయి.

ప్రయాణికుల నుంచి దొంగలు 8 తులాల బంగారం దోచుకెళ్లారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. బాదితులు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందినవారిగా గుర్తించారు. వీరిలో బండవేల్కిచర్లకు చెందిన ఉపాధ్యాయుడు రాములు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రమేష్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details