Simhachalam Temple: విశాఖలోని సింహాద్రి అప్పన్న ఉప దేవాలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చోరీకి యత్నించారు. దక్షిణ ద్వారం తలుపులు పగలగొట్టిన దొంగలు... సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆలయాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆలయంలోని వస్తువులేవీ చోరీకి గురవ్వలేదని అధికారులు తెలిపారు. ఆలయం చుట్టుపక్కల నిర్మానుష్యంగా ఉండటంతో చోరీకి సాహసించి ఉంటారని ఆలయాధికారులు భావిస్తున్నారు.