నిజామాబాద్ నగరంలోని ఓ దేవాలయంలో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ అనుకోని సంఘటన ఎదురైంది. చోరీకి యత్నించి బయటకు వస్తూ.. గోడకు పైరేకుల మధ్య ఇరుక్కుపోయి బయటకు పడలేక గిలగిలలాడుతూ పోలీసులకు దొరికిపోయాడు.
అయ్యో ఇలా ఇరుక్కు పోయానేంటి? - తెలంగాణ వార్తలు
ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చి రేకుల్లో ఇరుక్కుపోయిన ఘటన నిజామాబాద్లో జరిగింది. అక్కడి చేరుకున్న పోలీసులు దొంగను బయటకు తీసి స్టేషన్కు తరలించారు.
theft
ఆర్మూర్ మాలపల్లికి చెందిన బేల్దారి రఘు అనే యువకుడు బుధవారం మధ్యాహ్నం నగర శివారులో ఉన్న సుఖ్ జిత్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న మహాలక్ష్మి మందిరంలో చోరీకి పాల్పడ్డాడు. అనంతరం దేవాలయం వెనుక వైపు నుంచి గోడ మీద నుంచి బయటకు రావాలని ప్రయత్నించి గోడకు పై రేకుల మధ్య ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి అతడిని రక్షించి స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:6 గంటలపాటు.. ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించిన అనిశా