Thief Robbed at Siddipet Sub-Registrar office: తెలంగాణలోని సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు కలకలం రేపింది. కారులోని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు.. అతని వద్ద నుంచి రూ.40 లక్షలు లాక్కెళ్లారు.
భూమి రిజిస్ట్రేషన్ కోసం బాధితులు డబ్బును తీసుకురాగా.. పల్సర్ బైకుపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. కారులోని వారిని తుపాకీతో బెదిరించి నగదును తస్కరించే ప్రయత్నం చేశారు. అయితే.. వాళ్లు వెంటనే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దుండగులు ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం దుండగులు డబ్బులతో ఉడాయించారు. గాయపడ్డ డ్రైవర్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.