పాఠశాలల పని వేళల్లో మార్పు లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో మాట్లాడారని చెప్పారు. అన్ని పాఠశాలలు ఎప్పటిలాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని మంత్రి తెలిపారని వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
SCHOOL TIMINGS: 'పాఠశాలల పని వేళల్లో మార్పు లేదు' - ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వార్తలు
రాష్ట్రంలో పాఠశాలల పని వేళల్లో మార్పు లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు.
పాఠశాలల పని వేళల్లో మార్పు లేదు