ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ:ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై అయోమయం - telangana intermediate exams 2020

కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. సాధారణంగా ఫలితాలు ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. ఇంటర్‌బోర్డు మాత్రం కాలపట్టికను ప్రకటించలేదు. తప్పిన వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చే ఆలోచనపై కూడా చర్చ సాగుతోంది.

inter-supplementary-examinations
inter-supplementary-examinations

By

Published : Jun 19, 2020, 9:55 AM IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ద్వితీయ ఇంటర్‌లో 4.80 లక్షల మందికి ఉత్తీర్ణులైంది 2.88 లక్షల మందే. ఇంకా దాదాపు రెండు లక్షల మంది తప్పారు. వారు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంది.

ఇక మొదటి ఏడాదిలో తప్పిన వారితోపాటు మార్కులు పెంచుకునేందుకు దాదాపు సగం మందికిపైగా పరీక్షలు రాస్తారు. సాధారణంగా ఫలితాలు ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. ఆ ప్రకారం ఈసారి జులై నెలాఖరులో జరగాలి. ఇంటర్‌బోర్డు మాత్రం కాలపట్టికను ప్రకటించలేదు.

వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ఈసారి ఆ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. తప్పిన వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చే ఆలోచనపై కూడా చర్చ సాగుతోంది. పరీక్షలపై రెండు మూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ఇంటర్​ ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు

ABOUT THE AUTHOR

...view details