ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tollywood Drugs case: పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు: ఎఫ్ఎస్ఎల్

By

Published : Sep 18, 2021, 4:26 PM IST

Updated : Sep 18, 2021, 7:44 PM IST

పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు
పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు

16:24 September 18

పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు

టాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో ఎట్టకేలకు కొంత పురోగతి కనిపించింది. సినీ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్​ఎస్​ఎల్​ నివేదికలో వెల్లడించింది. పూరి జగన్నాథ్‌, తరుణ్​.. రక్తం, వెంట్రుకలు, గోళ్లను ఎఫ్​ఎస్​ఎల్​ పరీక్షించింది. 2017 జులైలో ఇద్దరి నమూనాలను తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ సేకరించింది.

స్వచ్ఛందంగానే ఇచ్చారు..

పూరి, తరుణ్​.. ఇద్దరూ రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు స్వచ్ఛందంగా ఇచ్చారని ఎఫ్​ఎస్​ఎల్​ వివరణ ఇచ్చింది. గతేడాది డిసెంబర్​ 8న ఎక్సైజ్‌ శాఖకు ఎఫ్​ఎస్​ఎల్​ నివేదిక సమర్పించగా.. ఎక్సైజ్‌ శాఖ కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌లో వివరాలు కోర్టుకు వెల్లడించింది. ఎఫ్​ఎస్​ఎల్​ ఏడీ వాంగ్మూలాన్ని కూడా ఎక్సైజ్‌ అధికారులు కోర్టుకు సమర్పించారు.

నాలుగేళ్లుగా సాగుతున్న కేసు...

2017లో టాలీవుడ్​లో కలకలం రేపిన మత్తుమందుల కేసు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఆబ్కారీ అధికారులు నాలుగేళ్లు దర్యాప్తు జరిపి... చివరకు ఏమీ లేదని తేల్చడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు రేకెత్తాయి. మత్తుమందుల సరఫరాలో ప్రధాన సూత్రధారి కెల్విన్‌తో టాలీవుడ్‌ ప్రముఖులకు ఉన్న సంబంధాలపై ఆబ్కారీశాఖ గతంలో దర్యాప్తు జరిపినప్పుడు తాను చాలామందికి డ్రగ్స్‌ అందజేసేవాడినని చెప్పాడు. ఆ వాంగ్మూలం ఆధారంగా వారందర్నీ పిలిచి విచారించారు.

అప్పుడే తేల్చేసి.. మరోసారి..

ఈ విచారణ వల్ల... కెల్విన్‌ ఆయా సినీ ప్రముఖులకు మత్తుమందులు సరఫరా చేసినట్లు కానీ.. వారు వాటిని వాడినట్లు కానీ.. ఎలాంటి ఆధారాలను అధికారులు సేకరించలేకపోయారు. చివరికి వారి రక్తం, గోళ్లు, వెంట్రుకల వంటి నమూనాలను సేకరించి విశ్లేషించారు. అప్పుడే మాదకద్రవ్యాల వినియోగంపై వీసమెత్తు ఆధారం కూడా లభించకపోవటం వల్ల ఈ కేసులో టాలీవుడ్‌ ప్రముఖుల పాత్రలేదని తేల్చేశారు. కేవలం డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పట్టుబడ్డ కెల్విన్‌ ముఠాపైనే అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో కెల్విన్‌ ముఠాకు, టాలీవుడ్‌ ప్రముఖులకు మధ్య జరిగిన నిధుల బదిలీపై ఈడీ దృష్టి సారించింది. ఈ తరుణంలో మరోసారి.. పూరిజగన్నాథ్​, తరుణ్​ నమూనాల్లో ఎలాంటి డ్రగ్స్​ ఆనవాళ్లు లేవని ఎఫ్​ఎస్​ఎల్​ నివేదిక సమర్పించింది.

సంబంధిత కథనాలు.

Tollywood Drugs Case: 6 గంటలపాటు నటి రకుల్​ప్రీత్ సింగ్​ విచారణ

DRUGS CASE: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి ముమైత్​ఖాన్​

Tollywood Drugs Case: ఐదు గంటలుగా సినీనటి ఛార్మి విచారణ.. ఈడీ ప్రశ్నల వర్షం

Last Updated : Sep 18, 2021, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details