ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS - AP water war: 'అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది' - water disputes between ap and Telangana

ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరడాన్ని తాము ఖండిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రా ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు.

శ్రీనివాస్ గౌడ్
శ్రీనివాస్ గౌడ్

By

Published : Jul 2, 2021, 3:49 PM IST

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని తెలంగాణకు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం కూడా వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరడాన్ని ఖండిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీ సీఎంలు గతంలో ఇచ్చిన జీవోలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీటి అవసరాలు తీసుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అంతా తమవారేనన్న శ్రీనివాస్ గౌడ్.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ప్రశాంతంగా ఉన్నామని సెటిలర్లు చెబుతున్నారు.

ఇదీచూడండి:space tour: తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ

ABOUT THE AUTHOR

...view details