తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని గణేశ్ నగర్ కాలనీలో దొంగతనం జరిగింది. రంగారెడ్డి అనే రైతు ఇంట్లో 33 తులాల బంగారం అపహరణకు గురైంది. పొలం పనులకు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేలోగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి.
తెలంగాణ: రైతు ఇంట్లో చోరీ.. 33 తులాల బంగారం అపహరణ - రైతు ఇంట్లో చోరీ వార్తలు రంగారెడ్డి జిల్లా
రైతు.. పొలం పనులకు వెళ్లి వచ్చేలోగా 33 తులాల బంగారం చోరీ జరిగింది. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని గణేశ్ నగర్లో చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రైతు ఇంట్లో చోరీ.. 33 తులాల బంగారం అపహరణ
నెక్లెస్, ఉంగరాలు, చైన్లు, కమ్మల బుట్టలతో కలిపి మొత్తం 33 తులాల బంగారం చోరీ జరిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.