ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏఎన్​యూ వీసీపై గవర్నర్​కు ఫిర్యాదు - ఏఎన్​యూ వీసీపై గవర్నర్​కు తెదేపా ఎమ్మెల్సీల ఫిర్యాదు

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉప కులపతి వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు గవర్నర్​ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వీసీ అవినీతికి పాల్పడడంతో పాటు విద్యార్థులతో అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెదేపా నేతలతోపాటు పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి ఏఎన్‌యూలో పరిస్థితిని వివరించారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, రామకృష్ణ , సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, విద్యార్థి సంఘాల నేతలు గవర్నర్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు .

Thedepa MLC's Complaint to Governor on ANU Weasi
ఏఎన్​యూ వీసీపై గవర్నర్​కు తెదేపా ఎమ్మెల్సీల ఫిర్యాదు

By

Published : Feb 17, 2020, 5:50 PM IST

ఏఎన్​యూ వీసీపై గవర్నర్​కు ఫిర్యాదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details