అన్నయ్యలే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతి ఫిర్యాదు చేయడంతో భయాందోళనకు గురైన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సొంత అన్నతోపాటు పెద్దమ్మ కొడుకు అజయ్.. చిన్నతనం నుంచి లైంగికంగా హింసిస్తున్నారంటూ ఓ యువతి నిన్న రాత్రి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా భయాందోళనకు గురైన అన్న అజయ్‌కుమార్ రామవరంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆత్మహత్య - Telangana Bhadradri kottagudem crime news
అన్నయ్యలు తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ఫిర్యాదు చేసిన కేసులో.. ఆమె అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న ఓ యువతి అన్నయ్యలు లైంగికంగా హింసిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.
మృతుడు అజయ్ కుమార్