ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్రాన్స్​జెండర్​ను పెళ్లిచేసుకున్న యువకుడు - transgender marriage

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ యువకుడు పెద్దలను ఒప్పించి హిజ్రాను వివాహం చేసుకున్నారు. వివరాలు.. భూపాలపల్లికి చెందిన యువకుడు రూపేశ్‌, ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన హిజ్రా అఖిలకు మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

హిజ్రాతో యువకుడి వివాహం
హిజ్రాతో యువకుడి వివాహం

By

Published : Mar 12, 2022, 12:10 PM IST

పెద్దలను ఒప్పించి ఓ యువకుడు, హిజ్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వివాహం చేసుకున్నారు. వివరాలు.. భూపాలపల్లికి చెందిన యువకుడు రూపేశ్‌, ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన హిజ్రా అఖిలకు మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

హిజ్రాతో యువకుడి వివాహం

గత 3 నెలల నుంచి ఇల్లెందు పట్టణంలోని స్టేషనుబస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఇరు కుటుంబాలకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించారు. వారంతా అంగీకరించడంతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా శుక్రవారం పెళ్లి చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details