గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా... ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లో సచివాలయ సిబ్బందిని అభినందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సాధ్యం చేసేందుకు గతేడాది ఇదే రోజున ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ విజయవంతమైనట్లు సీఎం స్పష్టం చేశారు.
సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించండి: సీఎం జగన్ - cm jagan news
నేటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా...ఈ రోజు సాయంత్రం 7గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లతో సచివాలయ సిబ్బందిని అభినందించాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.
సీఎం జగన్
అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇంటికి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందిస్తున్నట్లు సీఎం వివరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోన్న గ్రామ సచివాలయ వ్యవస్థను అందరూ అభినందించాలని జగన్ కోరారు.
ఇదీ చదవండి:గిరిజనులకు భూపట్టాల పంపిణీ.. హామీ నిలబెట్టుకున్నామన్న సీఎం