Godavari-kaveri river connection : గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. 5 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదరులకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ లేఖ పంపింది. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో భేటీ జరగనుంది.
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై నేడు ప్రత్యేక సమావేశం - ఏపీ వార్తలు
Godavari-kaveri river connection : ఐదు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3గంటలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో భేటీ జరగనుంది.
Union Ministry of Water Resources