ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Terrorists In Tamilnadu: తమిళనాడులోకి ఉగ్రవాదుల చొరబాటు.. కేంద్రం హెచ్చరిక.!

తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే సమాచారంతో కేంద్ర హౌం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కోస్ట్​గార్డ్​ దళాలు, ఎన్​ఐఏ నిఘా పెంచాయి. తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు.

Terrorists In Tamilnadu: తమిళనాడులోకి ఉగ్రవాదుల చొరబాటు.. కేంద్రం హెచ్చరిక.!
Terrorists In Tamilnadu: తమిళనాడులోకి ఉగ్రవాదుల చొరబాటు.. కేంద్రం హెచ్చరిక.!

By

Published : Sep 4, 2021, 12:39 PM IST

తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందినట్లు కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. 15 మంది వరకు సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించారని కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అనుమానం వ్యక్తం చేసింది. తీరం నుంచి కేరళకు వెళ్లి అటు నుంచి పాకిస్థాన్​ చేరుకునేందుకు పథకం వేశారని వెల్లడించింది. కోస్ట్‌గార్డ్‌ దళాలు, ఎన్‌ఐఏ నిఘా పెంచాయి. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు ఆదేశించారు. ఏమాత్రం సందేహం వచ్చినా అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు సహా కేరళ, కర్నాటకలను కూడా కేంద్రం హెచ్చరించింది.

కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం తదితర సముద్రతీర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. చెన్నైలోనూ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. నగరంలోని నివాస ప్రాంతాల్లో ఎవరైనా అనుమానస్పదంగా సంచరిస్తే సమాచారమివ్వాలని స్థానికులకు పోలీసులు సూచించారు.

బుధవారం సాయంత్రం పూందమల్లిలోని రెసిడెన్షియల్‌ ప్లాట్‌ వద్ద అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని క్యూబ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు సముద్రతీర ప్రాంతాల్లోని జాలర్ల కుప్పాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు పడవల్లో వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సముద్రతీర భద్రతాదళం పోలీసులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని జాలర్లను ఆదేశించారు.

కన్యాకుమారి, కుళచ్చల్‌, కేరళ సరిహద్దుల్లోని తీర ప్రాంతాల్లో భద్రతాదళం గస్తీ తిరుగుతున్నారు. కన్యాకుమారి జిల్లా నుంచి కేరళ తీర ప్రాంతాలైన మునప్పం, అళికోడ్డు ప్రాంతాలకు చేపలవేటకు వెళ్తున్న జాలర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కన్యాకుమారి తీరం పొడవునా గస్తీ తీవ్రతరం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:Recruitments: 50 లక్షల కొత్త నియామకాలు!

ABOUT THE AUTHOR

...view details