Theft in PS: తెలంగాణ వరంగల్‌లోని ఓ పోలీస్ స్టేషన్లో చోరీ జరిగింది. అవును మీరు విన్నది నిజమే. విచారణ జరుగుతున్న సమయంలోనే పోలీసుల సెల్ఫోన్లు, పర్సులు ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. అదీ ఏకంగా పోలీసుల సెల్ఫోన్లను అపహరించడం చర్చనీయాంశంగా మారింది. వారికే వస్తువులకే రక్షణ లేకపోతే మరీ సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Theft in PS: పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. ఏం దొంగిలించారంటే..!
ఎక్కడైనా దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ పీఎస్‌లోనే దొంగలు పడితే మరి ఎవరికీ ఫిర్యాదు చేయాలి. కానీ సరిగ్గా ఇలాంటి సంఘటనే తెలంగాణలో జరిగింది. పోలీసులకు సంబంధించిన సెల్ఫోన్లు, పర్సులు ఓ దుండగుడు ఎత్తుకెళ్లారు.
Theft in PS
Theft in police statin: వరంగల్ లోని మట్వాడ పోలీస్ స్టేషన్లో విచారణ కోసం నిందితున్ని తీసుకొచ్చారు. ఎవరూ లేని సమయంలో నిందితులు పీఎస్‌లోని పర్సులతో పాటు సెల్ఫోన్లను అపహరించాడు. గత నెల దుకాణంలో జరిగిన దొంగతనం కేసు నిందితుల్ని విచారణ చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లోనే సెల్ ఫోన్ల చోరీ అపహరించడం చర్చనీయాంశంగా మారింది. కాగా నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.