ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి ఎంపీలుగా ప్రమాణం చేశారు. వీరిచేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. మరో అభ్యర్థి పరిమళ్ నత్వానీ అనివార్య కారణాల చేత ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
'రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం' - పిల్లి సుభాశ్ చంద్రబోస్ లేటెస్ట్ న్యూస్
రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి ఎంపీలుగా ప్రమాణం చేశారు.
రాష్ట్రంలో 80శాతం వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయం రంగానికి ప్రాధాన్యత కల్పించారన్నారు. కరోనాతో దేశం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని... పేదలను, రాష్ట్రాలను ఆదుకునే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలు కేంద్రానికి వివరించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఎంపీ మోపిదేవి వెంకటమరమణ అన్నారు.
ఇవీ చూడండి-రాజ్యసభ: నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం
TAGGED:
ayodyaramreddy swearing news