ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని' పిటిషన్లపై హైకోర్టులో విచారణ...ఈనెల 9కి వాయిదా - రాజధాని వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో రోజువారీ విచారణ

రాజధాని వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో రోజువారీ విచారణ జరిగింది. సీజే జస్టిస్ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం... రాజధానుల వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై విచారణ చేపట్టింది. విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది.

ap high court
ఏపీ హైకోర్టు

By

Published : Oct 6, 2020, 12:34 PM IST

Updated : Oct 6, 2020, 3:50 PM IST

మాట్లాడుతున్న న్యాయవాది లక్ష్మీనారాయణ

రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ్టి నుంచి రోజువారీ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధానమైనవి, అనుబంధ పిటిషన్లు కలిపి 100కు వరకూ దాఖలయ్యాయి. ఇవాళ 15 పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పిటిషనర్ల తరపున మిగతా న్యాయవాదులు ఆన్​లైన్ ద్వారా తమ వాదనలు వినిపించారు.

పూర్తి వివరాలు సమర్పించాలి...
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల అంశంపై శాసనమండలి సెలక్ట్ కమిటికి పంపినా... వాటిని చట్టం చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపారు. అయితే ఈ అంశంపై శాసనమండలిలో జనవరిలో జరిగిన పూర్తి చర్చల వివరాలు, సీడీలు సీల్డ్ కవర్​లో సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు అంశాలకు సంబంధించి గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది.

ఇక రాజధాని పిటిషన్లు విచారణలో ఉండగా.... విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి చర్యలు ప్రారంభించటంపై దాఖలైన పిటిషన్​ని విచారించింది. అసలు ముఖ్యమంత్రి వసతి కోసం నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చెప్పాలని హైకోర్టు కోరినట్లు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 9వ తేదికి వాయిదా వేశారు.

డీజీపీ పిటిషన్​పై విచారణ
ఇక పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి డీజీపీ ఓ కమిటీ ఏర్పాటు చేయటాన్ని... ఆ కమిటీ విశాఖలో పర్యటించటంపైనా దాఖలైన పిటిషన్​పై విచారణ జరిగింది. చట్టం అమలు కాకుండా ఎలా ఇలాంటి కమిటీలు వేస్తారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కూడా 9వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. గతంలో స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిన పిటిషన్లపై 9వ తేదీన తుది విచారణ ఉంటుందని ధర్మాసనం చెప్పినట్లు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ వెల్లడించారు.

ఇదీ చదవండి:ఆంగ్లమాధ్యమం అంశంలో ఏపీ పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ

Last Updated : Oct 6, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details