POCSO Court: కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ సవతి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాచిగూడ ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం ప్రకారం.. ఏపీలోని మంత్రాలయానికి చెందిన వివాహిత భర్త చనిపోవడంతో మహమ్మద్ జహంగీర్(35) ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఉపాధికి హైదరాబాద్‌కు వచ్చి బర్కత్‌పురలోని అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఇళ్లలో పాచి పని చేయడానికి ఉదయం వెళ్లేది.
బాలికపై అత్యాచారం.. సవతి తండ్రికి 20 ఏళ్ల జైలు.. - 20years imprisonment for step father in a rape case
Pocso Court: కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో సవతి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. తెలంగాణలోని హైదరాబాద్ బర్కత్‌పురలో 2017లో నిందితుడితో పాటు అతని తమ్ముడు బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఘటనలో న్యాయస్థానం నిందితుడికి రూ. 5వేల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష, అతని తమ్ముడికి మూడేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా విధించింది.
బాలికపై అత్యాచారం.. సవతి తండ్రికి 20 ఏళ్ల జైలు..
ఆ సమయంలో మహమ్మద్ జహంగీర్ కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంబర్‌పేటలో ఉండే అతని తమ్ముడు మహమ్మద్ భాషా(32) సైతం అత్యాచారం చేశాడు. 2017లో బాలిక చదివే పాఠశాల ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. పదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత మహమ్మద్ జహంగీర్‌కు 20 ఏళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా, అతని సోదరుడు మహమ్మద్ భాషాకు మూడేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు.
ఇవీ చదవండి :