ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికల్లో రాష్ట్రానికి మూడో స్థానం - సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికల్లో రాష్ట్రానికి మూడో స్థానం

నీతి ఆయోగ్‌ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికలో 72 మార్కులతో గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది. గురువారం నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌లు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక డ్యాష్‌బోర్డును ఆవిష్కరించి, 2020 నివేదికను విడుదల చేశారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికల్లో రాష్ట్రానికి మూడో స్థానం
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికల్లో రాష్ట్రానికి మూడో స్థానం

By

Published : Jun 4, 2021, 6:50 AM IST

నీతి ఆయోగ్‌ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికలో 72 మార్కులతో గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది. గురువారం నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌లు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక డ్యాష్‌బోర్డును ఆవిష్కరించి, 2020 నివేదికను విడుదల చేశారు. 75 మార్కులతో కేరళ తొలిస్థానంలోను, 74 మార్కులతో హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు సంయుక్తంగా రెండోస్థానంలోను ఉన్నాయి.

తొలి 5స్థానాల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలు, రెండు హిమాలయ రాష్ట్రాలు, సిక్కిం, మహారాష్ట్ర కలిపి మొత్తం 9 రాష్ట్రాలు నిలిచాయి. 52 మార్కులతో బిహార్‌ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌ 79 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల్లో రాష్ట్రాల పురోగతిని వెల్లడిస్తూ 2018 నుంచి నీతి ఆయోగ్‌ నివేదికలు విడుదల చేస్తోంది. మొత్తం 16 లక్ష్యాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. వీటిలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా 0-100 మార్కులు ప్రకటించారు. ఏ రాష్ట్రమైనా 100 మార్కులు సాధిస్తే 2030 లక్ష్యాన్ని ముందే సాధించినట్లు ప్రకటిస్తున్నారు.

0-49 మధ్యలో మార్కులు సాధించిన రాష్ట్రాలను ఆశావహ, 50-64 మధ్య మార్కులు సాధించిన రాష్ట్రాలను పెర్ఫార్మర్‌, 65-99 మధ్య అయితే ఫ్రంట్‌రన్నర్‌, 100 మార్కులొస్తే అచీవర్‌గా విభజించారు. మొత్తం 16 లక్ష్యాల్లో అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇంధన లభ్యత విభాగంలోనే ఆంధ్రప్రదేశ్‌ 100 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఏపీతో పాటు మరో 14 రాష్ట్రాలు కూడా ఈ అంశంలో 100 మార్కులు సాధించాయి. మిగిలిన వేటిలోనూ ఏపీకి అలా రాలేదు. మొత్తం 72 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచినా.. విభాగాలవారీగా చూసినప్పుడు 5 అంశాల్లోనే టాప్‌5లో ఉంది. 7 వి భాగాల్లో 6-9 స్థానాల్లో, 4 విభాగాల్లో 10-19 స్థానాలకు పరిమితమైంది. క్రితంసారితో పోలిస్తే విద్యానాణ్యత, రక్షితనీరు, పారిశుద్ధ్యం, గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, భూమిపై జీవనం, శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు మార్కులు తగ్గాయి. మిగిలిన అంశాల్లో పెరిగాయి. విద్యానాణ్యతలో ఉత్తర్‌ప్రదేశ్‌కంటే వెనుక నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details