దేవాలయ పదవుల్లో రిజర్వేషన్లు... జీవో జారీ - g.o issued
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్ బోర్డుల్లో రిజర్వేషన్లను అమలు చేయనుంది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
దేవాలయ పాలక మండళ్లు, ట్రస్ట్ బోర్డుల్లో రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దేవాలయ పాలక మండళ్లల్లో రిజర్వేషన్ల అమలుపై శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ చేసిన ప్రభుత్వం తక్షణమే అమలు అయ్యేందుకు వీలుగా ఈ ఆదేశాలు వెలువరించింది. ఇకపై దేవాలయ కమిటీలు, ట్రస్టు బోర్డుల్లోనూ ఎస్సీ ఎస్టీ , బీసీలకు 50 శాతం పదవులతో పాటు, మహిళలకు 50 శాతం పదవులు కేటాయించేలా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో పాలకమండలి సభ్యుల సంఖ్యను 16 నుంచి 29కి పెంచుతూ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేశారు.