ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోదావరి–కృష్ణా అనుసంధానంలో మరో బృహత్తర ఆలోచన - new project to merge Godavari and Krishna

గోదావరి, కృష్ణా అనుసంధానంలో ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర ఆలోచన చేసింది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించింది.

అనుసంధానం

By

Published : Oct 28, 2019, 11:48 PM IST

సముద్రంలో కలిసే గోదావరి జలాల వినియోగానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించాలని చూస్తోంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించింది. ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.60 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు సమాచారం. లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కరవు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా దీనిని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details