పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యులు విడుదలపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని భావిస్తోంది.
పంచాయితీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు షెడ్యూలు జారీ చేయటంతో పాటు రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందంటూ ప్రోసీడింగ్స్ జారీ చేయటంపై ప్రభుత్వం ఈ కార్యాచరణ చేపట్టనుంది. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కొనసాగుతున్న కారణంగా.. ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుందని సమాచారం.