ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణకిశోర్‌పై అవినీతి ఆరోపణలు రావటంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీ, అనిశా డీజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కృష్ణకిశోర్ అమరావతి విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
గతంలో సస్పెండ్ అయిన జీఏడీలోని ఇద్దరు అధికారులు వివరణ ఇవ్వడం వల్ల ప్రభుత్వం వారికి పోస్టింగ్ ఇచ్చింది. జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జయరాం, స్పెషల్ ఆఫీసర్ అచ్చయ్యకు మళ్లీ పోస్టింగ్ లభించింది. ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరి బదిలీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై వీరు సస్పెండయ్యారు.