గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం తెదేపాను దెబ్బతీయడానికేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్ని ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం పునఃసమీక్షించడానికి గానీ, పరీక్షించడానికి గానీ చట్టబద్ధత లేదన్నారు. అలాంటి నిబంధనేదీ రాజ్యాంగంలో లేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగే వ్యవస్థ అనీ చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అనడం అర్థరహితమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గత నిర్ణయాల్ని ఎందుకు పరిశీలించాల్సి వచ్చిందో ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదన్నారు. కేవలం అనుమానంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ ఉపసంఘం, సిట్ల ఏర్పాటుకు జారీ చేసిన జీవో 1411,344లను రద్దు చేయాలని కోరారు.ఆ జీవోలపై తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెదేపాను దెబ్బతీయాలనే సిట్ ఏర్పాటు - ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం
తెదేపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటుకు వైకాపా సర్కార్ ఉత్తర్వులివ్వడాన్ని సవాల్ చేస్తూ వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

The state government has set up a sit for harass tdp