ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండు పోర్టులు.. నాలుగు చేపల రేవుల అభివృద్ధి

రాష్ట్రంలో రెండు పోర్టులు, నాలుగు చేపల రేవుల అభివృద్ధికి రూ.6,425.76 కోట్లతో రూపొందించిన టెండరు ప్రతిపాదనలను ప్రభుత్వం న్యాయసమీక్షకు పంపింది. అభ్యంతరాల వ్యక్తీకరణకు వారం గడువు ఇచ్చింది.

The state government has sent port development proposals for judicial review.
రెండు పోర్టులు.. నాలుగు చేపల రేవుల అభివృద్ధి

By

Published : Oct 20, 2020, 10:01 AM IST

రాష్ట్రంలో రెండు పోర్టులు, నాలుగు చేపల రేవుల అభివృద్ధికి రూ.6,425.76 కోట్లతో రూపొందించిన టెండరు ప్రతిపాదనలను ప్రభుత్వం న్యాయసమీక్షకు పంపింది. 2020-21 ప్రామాణిక ధరల (స్టాండర్డ్‌ రేట్ల) ప్రకారం టెండరు ప్రతిపాదనలను రూపొందించింది. టెండరు పత్రాలను పరిశీలించి అభ్యంతరాలను తెలపడానికి వారం రోజుల గడువిచ్చింది.

* ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు మొదటి దశ అభివృద్ధికి గతంలో 2019-20 ప్రామాణిక ధరల ప్రకారం రూపొందించిన టెండరు ప్రతిపాదనను న్యాయ సమీక్షకు పంపింది. వాటిని వెనక్కు తీసుకుని 2020-21 ప్రామాణిక ధరల ప్రకారం అదనంగా ఒక బెర్తు నిర్మాణం, డ్రెడ్జింగ్‌ పనుల నిర్వహణకు రూ.2,646.84 కోట్లతో కొత్తగా టెండరు ప్రతిపాదనలను రూపొందించింది.

* శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ఓడరేవును రూ.2,573.15 కోట్లతో అభివృద్ధి చేయడానికి టెండరు ప్రతిపాదనలను రూపొందించారు. నాలుగు బహుళ వినియోగ బెర్తులు, డ్రెడ్జింగ్‌ పనులు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

* నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడల్లో చేపల రేవుల నిర్మాణానికి రూ.1,205.77 కోట్లతో ఒకే టెండరును రూపొందించారు.

* టెండరు విధివిధానాలను www.judicialpreview.ap.gov.in,www.ports.ap.gov.in, లో పరిశీలనకు ఉంచినట్లు ఏపీ మారిటైం బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి ముంబయి - చెన్నై -విశాఖ విమాన సర్వీసు

ABOUT THE AUTHOR

...view details