పుర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని విధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పుర ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మరణిస్తే అనుసరించాల్సిన నియమాలను వెల్లడించింది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి మరణిస్తే.. ఆ స్థానంలో ఎన్నికను వాయిదా వేయవచ్చని ఎస్ఈసీ తెలిపింది.
పురపాలక ఎన్నికల్లో అభ్యర్థి మరణిస్తే? - పుర ఎన్నికల విధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత
పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మరణిస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఈ విషయంపై పూర్తి స్థాయి నిర్ణయం ఎన్నికల అధికారులకు ఉంటుందని ఎస్ఈసీ వివరించింది.

పురపాలక ఎన్నికల్లో అభ్యర్థి మరణిస్తే
మృతి చెందిన అభ్యర్థికి సంబంధించిన డివిజన్, వార్డులో ఎన్నికను నిలిపి వేయవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికను నిలుపుదల చేసే విషయంపై పూర్తి స్థాయి నిర్ణయం ఎన్నికల అధికారులకు ఉంటుందని తెలిపింది. అభ్యర్థి మృతికి కారణాలను ఎన్నికల సంఘానికి వివరించాకే ఎన్నికను వాయిదా వేయాలని ఆదేశాల్లో వివరించారు.
ఇదీ చదవండీ..'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి'