ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YS Sharmila Padayatra 2021: ఎనిమిదో రోజు షర్మిల పాదయాత్రలో 'శ్యామల' - తెలంగాణ వార్తలు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra 2021) కొనసాగుతోంది. ఇవాళ్టి యాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇవాళ్టి సాయంత్రం వరకు ఎలిమినేడు గ్రామానికి చేరుకొని... షర్మిల అక్కడే బసచేస్తారు.

sharmila padayathra
sharmila padayathra

By

Published : Oct 27, 2021, 4:40 PM IST

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా... వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra) ఎనిమిదో రోజు కొనసాగుతోంది. ఇవాళ్టి యాత్రలో షర్మిలతో పాటు యాంకర్ శ్యామల పాల్గొన్నారు. షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామం నుంచి ఇవాళ ఉదయం 9 :30 గంటలకు యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా రాచలూర్ గ్రామం, గాజులపురుగు తండా క్రాస్ రోడ్, బేగంపేట్ గ్రామం చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసి... షర్మిల విరామం తీసుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మాదాపూర్ గ్రామం, ఇబ్రహీంపట్నంలోని ఎలిమినేడు గ్రామానికి చేరుకుని ఇవాళ్టి రాత్రికి ఎలిమినేడు గ్రామంలోనే బసచేస్తారు.

YS Sharmila Padayatra 2021

యాత్రకు శ్రీకారం ఇలా..

చేవెళ్ల మరో పాదయాత్రకు వేదికైంది. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 2003లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర చేపట్టారు. 2012లో షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. 230 రోజులపాటు 116 నియోజకవర్గాల్లో 3,112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. వైతెపాను స్థాపించిన ఆమె తాజాగా మరోమారు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించి 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. తిరిగి అక్కడే ముగించనున్నారు.

ఆవిర్భావం రోజే ప్రకటన

ఈ ఏడాది జులై 8న పార్టీ ఆవిర్భవించగా.. పాదయాత్ర చేపడతామని ఆ రోజే షర్మిల ప్రకటించారు. మరోవైపు నిర్మాణపరంగా ఇతర పార్టీలు జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటే... వైతెపా పార్లమెంట్‌ స్థానాలను ఎంచుకుని.., వాటికి కన్వీనర్లు, కోకన్వీనర్లను ప్రకటించింది. ప్రస్తుతం పాదయాత్ర కూడా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. తొలిరోజు కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఆర్‌.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ, కంచె ఐలయ్యతో పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను వైతెపా ఆహ్వానించింది.

రూట్ మ్యాప్ ఇదే..

మొదటి పది రోజులు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో యాత్ర సాగనుంది. ఇదే మాదిరి రాష్ట్రంలోని దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్‌మ్యాప్‌ను పార్టీ శ్రేణులు రూపొందించాయి. మొత్తం 26 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి. అన్ని మండలాల్లోని మున్సిపాలిటీలు, పెద్ద గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు.

ఇవాళ ఎనిమిదో రోజు యాత్ర రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్​ గ్రామం నుంచి ప్రారంభమైంది. సాయంత్రం వరకు ఎలిమినేడు గ్రామం చేరుకొని... షర్మిల అక్కడే బస చేస్తారు.

ఇదీ చదవండి:

TIRUMALA: నవంబర్​లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం జరగనుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details