వచ్చే విద్యా సంవత్సర క్యాలెండరులో పాఠశాల విద్యాశాఖ మార్పు చేస్తున్నట్లు తెలిసింది. ఏటా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకూ విద్యా సంవత్సరం ఉండగా..కరోనా విస్తృతి తగ్గకపోవడంతో ఈ సారి ఆగస్టు-2020 నుంచి జులై-2021 వరకూ కొనసాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ను ఎత్తేసిన 2 వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం..! - education news
లాక్‌డౌన్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సర క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు-2020 నుంచి జూలై-2021 వరకు కొత్త విద్యా సంవత్సరం ఉండేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం..!
Last Updated : May 3, 2020, 1:52 PM IST