కొవిడ్ కారణంగా తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.5.07 లక్షల కోట్ల మేరకు జీఎస్‌డీపీని (స్థూల రాష్ట్ర ఉత్పత్తి) నష్టపోతున్నట్లు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం అంచనా వేసింది. విభిన్నరంగాల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వచ్చే మొత్తం విలువనే స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారు. ఇందుకోసం వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలను ప్రామాణికంగా తీసుకుంటారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఈ రంగాల ద్వారా జరిగే మొత్తం ఉత్పత్తిని లెక్కకట్టి ఆ ఏడాది రాష్ట్రం సాధించిన స్థూల ఉత్పత్తిగా పరిగణిస్తారు. ఇది ఎంత పెరిగితే అంత పురోగతి ఉన్నట్లు భావిస్తారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అదే ప్రమాణికం. మొత్తం 24 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసిన ఎస్‌బీఐ ఈ రాష్ట్రాలు ఉమ్మడిగా 37,52,717 కోట్ల మేర జీఎస్‌డీపీని కోల్పోనున్నట్లు పేర్కొంది. ఇందులో 43.75% మొత్తం పట్టణ ప్రాంతాల్లో, 56.25% గ్రామీణ ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.2,53,925 కోట్లు, తెలంగాణ రూ.2,53,512 కోట్లగా ఉంటుందని అంచనా వేసింది.
కొవిడ్ కారణంగా తెలుగు రాష్ట్రాలకు భారీగా జీఎస్‌డీపీ నష్టం - Telugu states are losing about Rs 5.07 lakh crore in GSDP this fiscal due to Kovid
కొవిడ్ దెబ్బకు తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.5.07 లక్షల కోట్ల మేరకు జీఎస్‌డీపీని నష్టపోతున్నట్లు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం అంచనా కట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ప్రభావం..
తెలుగు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో జీఎస్‌డీపీ నష్టం 29%కి పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రభావం 71% మేర ఉంటుందని పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో తలెత్తే నష్టం జాతీయ సగటుకంటే తక్కువ ఉండగా, గ్రామీణ ప్రాంత నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ జీఎస్‌డీపీని నష్టపోయే రాష్ట్రాల వరుసలో ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 8వ స్థానంలో నిలుస్తున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ప్రజల కదలికలు పెరిగినట్లు ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ రోజులతో పోలిస్తే జులై 31 నాటికి 29.3% కదలికలు తగ్గగా, ఆగస్టు 28నాటికి అది 22కి పరిమితమైనట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తెలంగాణలో కదలికలు -31.2 నుంచి -26.7%కి చేరాయని తెలిపింది. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 67.6%, తెలంగాణలో 50.9% కొవిడ్ కేసులు పెరిగినట్లు పేర్కొంది.