కరోనా వైరస్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపైనా ప్రభావం చూపింది. మార్చి నెల జీతాన్ని రెండు విడతల్లో చెల్లించే ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్ 1న ఉద్యోగులకు చెల్లించే జీతాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు.... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఉద్యోగుల సంఘం అంగీకరించిందని తెలిపారు.
రెండు విడతల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు - ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత వార్తలు
కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల సగం జీతం మాత్రమే చెల్లించనుంది ప్రభుత్వం. మిగిలిన సగం నిదులు సర్దుబాటు అయ్యాక చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
salary