ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘డ్వాక్రా’ రుణ పరిమితి పెంపు - Credit limit for self-help groups

స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితిని పెంచుతున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇప్పటి వరకు గరిష్టంగా రూ.10 లక్షలు ఉన్న రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది.

‘Dwakra’ credit limit
‘డ్వాక్రా’ రుణ పరిమితి

By

Published : Aug 12, 2021, 8:51 AM IST

స్వయం సహాయక సంఘాలకు (డ్వాక్రా) ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సంఘాల తరఫున మహిళా సభ్యులకు అత్యధికంగా రూ.10 లక్షల రుణాన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. కేంద్రం విజ్ఞప్తి మేరకు తాజాగా ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేసింది. పొదుపు మొత్తాన్ని అవసరమైనప్పుడు తీసుకునే వెసులుబాటును డ్వాక్రా మహిళలకు కల్పించింది. వారి పొదుపు ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని బ్యాంకర్లకు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 84 లక్షల మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 95% సంఘాలు రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్నాయి.

కొత్త మార్గదర్శకాల ప్రకారం..

*స్వయం సహాయక సంఘాలకు ఇకపై ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు రుణాన్ని బ్యాంకులు ఇవ్వాలి.
*రుణ మంజూరుకు ఎలాంటి ముందస్తు డిపాజిట్లు అడగకూడదు.
*రుణం ఇచ్చేందుకు ఎలాంటి మార్జిన్‌ కూడా తీసుకోకూడదు.
*రూ.10 లక్షలలోపు రుణ మొత్తానికి క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ ఫర్‌ మైక్రో యూనిట్స్‌ కవరేజ్‌ లభిస్తుంది.

ఇదీ చదవండీ..GSLV: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలం.. క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య

ABOUT THE AUTHOR

...view details