కొవిడ్ తొలి దశలో నిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో తెలియని స్థితి. ఆ దశలో మొదటగా సీసీఎంబీలోనే రోజుకు వెయ్యి పరీక్షల సామర్థ్యంతో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేపట్టారు. ఆనాటి నుంచి వైరస్‌తో సహవాసం చేస్తున్నారు. దేశంలోనే తొలిసారి ఇక్కడి ల్యాబ్‌లో కృత్రిమ వైరస్‌ను పెంచారు. కొవిడ్ మందులు, టీకాలు వైరస్‌పై ప్రభావం చూపుతున్నాయో లేదో పరీక్షించడం ప్రారంభించారు. కాలం గడిచేకొద్దీ వైరస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయా రకాలను, ఉత్పరివర్తనాలను నిత్యం గమనిస్తూ, పరిశోధనలు కొనసాగిస్తున్నారు. చౌక ధరలో, సులభంగా చేసే డ్రైస్వాబ్ కొవిడ్ కిట్లను అభివృద్ధి చేశారు. మొత్తం 200 మందికి పైగా శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు, ఇతర సిబ్బంది షిప్టులవారీగా వేర్వేరు బృందాల్లో పనిచేస్తున్నారు.
వైరస్‌లో మార్పులపై నిఘా
వైరస్ మనదేశంలోకి ప్రవేశించిన తొలినాళ్ల నుంచే జన్యుక్రమ ఆవిష్కరణ ప్రక్రియ మొదలైంది. గత ఏడాది మార్చి ఆఖరులో ప్రారంభించాం. తొలుత పరిశోధక విద్యార్థుల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారితో టెస్టింగ్ ఇతరత్రా ప్రక్రియలు కొనసాగించినా.. ఆ తర్వాత ఒక్కో విభాగంలో పదుల సంఖ్యలో పరిశోధనల్లో పాల్గొంటున్నారు. నిర్ధారణ పరీక్షలు, వైరస్‌ను పెంచడం, ఔషధాలు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడం, జన్యుక్రమ ఆవిష్కరణ వరకు నాలుగు రకాల పరిశోధనలు సాగుతున్నాయి. ల్యాబ్‌లోని సగం మంది శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు పాలుపంచుకుంటున్నారు.-దివ్వతేజ్, యువ శాస్త్రవేత్త, జన్యుక్రమ ఆవిష్కరణ
*అన్నీ పక్కనపెట్టి ఏడాదికిపైగా కొవిడ్‌పైనే దృష్టిపెట్టాం. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి వస్తున్న వైరస్ నమూనాలను జన్యుక్రమ ఆవిష్కరణ ద్వారా వాటి రకాలు, వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తున్నాం. డిసెంబరు వరకు వెయ్యి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా.. ఇటీవల మరో 1500 వరకు చేశాం.
*దేశవ్యాప్తంగా వస్తున్న నమూనాలను ప్రాసెస్ చేసి వారంలో ఒకేసారి 500 వరకు జన్యుక్రమ ఆవిష్కరణ చేపడుతుంటాం. వేగంగా వీటి జన్యుక్రమాన్ని కనుగొని, విశ్లేషించి, బయటి ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతోనే నిరంతరం పనిచేస్తున్నాం. ప్రస్తుతానికి ఇదొక్కటే మా ముందున్న సవాల్.
*తొలి దశలో బృందంలో కొందరు వైరస్ బారిన పడ్డారు. త్వరగానే కోలుకున్నారు. మా పరిశోధన వైరస్ ఆర్‌ఆర్‌ఏపై కాబట్టి పెద్దగా భయపడింది లేదు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాం. ఎంత ప్రమాదమో తెలుసు కాబట్టి బయట ఉన్నా జాగ్రత్తగా ఉంటాం. వైరస్ ఏ రకం అన్నది ప్రధానం కాదు.. జాగ్రత్తగా ఉంటే కొవిడ్ నుంచి రక్షించుకోవచ్చు.
భయం పోగొట్టేందుకు సమయం పట్టింది