మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతిలో రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 589వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, అనంతవరం, బోరుపాలెం, వెంకటపాలెం, పెదపరిమి, నెక్కల్లు గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఏ ముఖ్యమంత్రైనా తమ రాజధాని, రాష్ట్రం అభివృద్ధి కావాలని చూస్తారని.. ఇక్కడ మాత్రం అలాంటి వాతావరణమే లేదని రైతులు వాపోయారు. వైకాపా ప్రజాప్రతినిధుల అండతో అమరావతిలో ఇసుక, కంకర తీసుకెళ్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
amaravathi: 589వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం.. - Capital Farmers Dharna Latest Information
రాజధాని గ్రామాల్లో(capital villages) రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు(protest) 589వ రోజుకు చేరాయి. రాజధానిని అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రాజధాని ప్రాంతంలో ధర్నా