High court: రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక దేవాదాయ అధికారి పోస్టును ప్రభుత్వం సృష్టించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. పరిపాలన అవసరాల కోసం ఏ పోస్టు సృష్టించాలి.. దేన్ని రద్దు చేయాలనే అధికారం ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. సర్వీసు సంబంధ వ్యవహారాల్లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేసింది. వ్యాజ్యాన్ని కొట్టేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది.
High Court: పోస్టుల సృష్టి, రద్దు అధికారం ప్రభుత్వానిదే: హైకోర్టు - పోస్టుల సృష్టి, రద్దు అధికారం ప్రభుత్వానిదేనన్న హైకోర్టు
High court: రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక దేవాదాయ అధికారి పోస్టును ప్రభుత్వం సృష్టించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని.. హైకోర్టు కొట్టేసింది. వ్యాజ్యాన్ని కొట్టేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది.
పోస్టుల సృష్టి, రద్దు అధికారం ప్రభుత్వానిదే: హైకోర్టు
ఏపీ దేవాదాయ చట్ట, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా దేవాదాయ అధికారి పోస్టును ప్రభుత్వం సృష్టించిందని, ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన మంత్రిప్రగడ లక్ష్మణరావు హైకోర్టులో పిల్ వేశారు.
ఇదీ చదవండి: