ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ, గుంటూరు ప్రజలు తమ రోషాన్ని చూపించారు: సజ్జల - Sajjala comments on Chandrababu

సీఎం జగన్ సంక్షేమ అభివృద్ధి పథకాలు విజయవంతం అయ్యాయని, ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమని... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ఈ ఫలితాలు బలపరిచాయన్నారు. వైకాపాకు వచ్చిన విజయం ప్రజల విజయమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నూరుశాతం అమలు చేశారని, మేనిఫెస్టోలో చెప్పని హామీలను సైతం సీఎం జగన్ నెరవేర్చారన్నారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి
సజ్జల రామకృష్ణా రెడ్డి

By

Published : Mar 14, 2021, 5:56 PM IST

సజ్జల రామకృష్ణా రెడ్డి

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు పూర్తి భరోసా వచ్చిందని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత ప్రజలను అవమానించిన చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఉద్యమం లేకపోయినా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇంకో ప్రాంతాన్ని మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూరు ప్రజలను చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రయోజనం లేదన్నారు.

విజయవాడ, గుంటూరు ప్రజలు తమ రోషాన్ని చూపించి చంద్రబాబును ఓడించారని సజ్జల పేర్కొన్నారు. లేని సమస్యలు సృష్టిస్తూ... ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అమరావతిలో చంద్రబాబు చేసిన మోసాన్ని జగన్ సరిదిద్దే ప్రయత్నం చేశారని, సీఎం ప్రయత్నాన్ని అమరావతి ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. రెండు రోజుల్లో ఛైర్​పర్సన్లు, మేయర్ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేస్తారని, అన్ని సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం చేస్తూ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎగిరిన వైకాపా జెండా

ABOUT THE AUTHOR

...view details