ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రచార జోరు.. మాటల హోరు.. వేడెక్కుతున్న మునుగోడు రాజకీయం

Parties are preparing for the munugode election battle: తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నిక సమరంలో మాటల తూటాలు పేలుతున్నాయి. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం రోజురోజుకూ వేడేక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఈ నెల 30న చండూరు మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. భాజపా సైతం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బహిరంగ సభ జరిపించాలని యోచిస్తోంది.

munugode election
మునుగోడు ఉపఎన్నిక

By

Published : Oct 10, 2022, 9:42 AM IST

మునుగోడు ఉపఎన్నిక

Parties are preparing for the munugode election battle: మునుగోడు... ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు ఉపఎన్నికలో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని కృతనిశ్చయంతో శ్రమిస్తున్నాయి. అధికార తెరాస తమ ప్రజాప్రతినిధులందరినీ ఉపఎన్నిక ప్రచారంలోకి దింపింది. భాజపా, కాంగ్రెస్‌లపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కార్లు, ద్విచక్ర వాహనాల ఆశ చూపి నేతలను, డబ్బులు ఆశ చూపి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి...భాజపా పన్నాగం పన్నిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టినా...భాజపాకు ఓటమి తప్పదని హరీశ్‌రావు అన్నారు.

ఏజెన్సీస్​లో 200 బ్రీజా కార్లు, 2000 ద్విచక్ర వాహనాలు కొనడానికి బుకింగ్​ చేసినట్లుగా తెరాసకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. భాజపా నాయకులు ఈనాడు మోటారు సైకిళ్లు కొనిస్తారు..రేపు బావుల దగ్గర మీటర్లు పెడతారు. రాజగోపాల్​ రెడ్డి బావుల దగ్గర మీటర్లు పెడితే తప్పేంటి అన్నారు. మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన అభివృద్ధికి పట్టం కడతారు. - హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్రవంతికి మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సహా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచార బరిలోకి దిగారు. చౌటుప్పల్‌ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించిన రేవంత్‌... తెరాస, భాజపాలపై విమర్శలు గుప్పించారు.. డబ్బు సంచులతో వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లను కోరారు.

ఓటుకు డబ్బులు ఇస్తామని చెబుతారు అవి ఎక్కడ నుంచి వచ్చాయో మునుగోడు ప్రజలు తెలుసుకోవాలి. పిల్లికి బిచ్చమైన పెట్టని వారు ఇప్పుడు ఇంత మొత్తంలో డబ్బులు ఇస్తానంటే ఎలా నమ్ముతున్నారు. మీకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్​ పార్టీ. డబ్బులు తీసుకోండి చేసిన పనిని చప్పుడు కాకుండా చేసేయండి.

- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ప్రచార గడువు ముగిసేలోపు అగ్రనేతలను రంగంలోకి దింపేలా ప్రధాన పార్టీలైనా తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మునుగోడులో సుమారు రెండు వేల మంది ఓటర్లకు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి బాధ్యత అప్పగించిన కేసీఆర్​.. మరోసారి స్వయంగా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 30న చండూరు మండలం బంగారిగడ్డ వద్ద కేసీఆర్​బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నెలన్నర క్రితం అగస్టులో మునుగోడులో ప్రజాదీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించిన తెరాస ఎన్నికల ప్రచారం ముగిసే రెండు రోజుల ముందు కేసీఆర్​ బహిరంగసభలో పాల్గొంటారని తెలిసింది. మరోవైపు.. ఈ నెల 20 తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చౌటుప్పల్, చండూరు పురపాలికలతో పాటూ మునుగోడులో రోడ్‌షోలలో పాల్గొంటారని సమాచారం. ఈ మేరకు పార్టీ క్యాడర్‌ ఏర్పాట్లు చేస్తోంది.

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి మునుగోడులోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దిల్లీ నుంచి అగ్రనేతను రంగంలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులో 31న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బహిరంగ సభను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై భాజపా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ జాతీయ నేతలను సంప్రదించినట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఒక దఫా సభను నిర్వహించడంతో ఇప్పుడు జరిగే సభకు పార్టీ జాతీయధ్యక్షుడిని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details